పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము.

17

గల్పించెను. ఇట్లు వానిరథచక్రము గ్రుంగుటకు బ్రాహ్మణ శాపము గల దని వేరొకకథ కల్పింపఁబడినది. మఱియు రథస్థుఁడగునర్జునుఁడు భూమీస్థుఁ డగుకర్ణుని దునిమె నని చెప్పఁబడినది. ఏనుఁగుమీఁద నున్న భగదత్తునితో నర్జునుఁడు యుద్ధము చేయలేదా? ఉభయపక్షవీరులును ననేకపర్యాయములు విరథులయి రథస్థులమీఁద దలపడలేదా? నలుప్రక్కలను గ్రిందు మీఁదు తలఁపక ప్రయోగము చేయువాఁడే వేటుకాఁడు కాని యితరుఁడగునా? ఈగ్రంథకర్తకు యుద్ధసంప్రదాయమే తెలియదు.

4 శల్యుఁ డెప్పుడో యొకనాఁడు కర్ణుని సారథ్యము చేయునని తెలిసికొని ధర్మరాజాశల్యునితో 'నీకు గర్ణుని సారథ్యము తటస్థ మగును. అప్పుడు కర్ణునికి మనోవైకల్యముఁ గలిగించి యర్జునుని గాపాడు, మని కోరినటుల నున్నది. అటుల మోసముఁజేయు మని ధర్మరా జట్లు ప్రార్థించునా ! రా జగుశల్యుఁ డట్టిపని జేయఁ బ్రతిన యిచ్చునా ? కావునఁ దీనిని నమ్మఁగూడదు. మఱియు, తనను దక్కిన సోదరులను గాపాడు మని ధర్మరా జేల కోరరాదు. మరి యేమి యనిన : అటుల మనో వైకల్యముచేత గర్ణుఁ డర్జునునిఁ జంపలేకపోయెను గాని లేకపోయిన జంపియే యుండు నని సూచించుటకు నీగాథ కల్పింపబడినది.

కౌరవపక్షపాతబుద్ధితో నీగ్రంథకర్త కల్పించినగాథల ననేకముల నిట్లెత్తి చెప్పితిని, మఱికొన్ని నిలిచియుండిన నుండ