పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

ఉపోద్ఘాతము.

ధర్మరాజు రాజ్యముచేయుటకుఁ దగినవాఁడు గాని నే నందుకుఁ దగ నని కుంతితోఁ జెప్పెనఁట. సూతజాతి గలిగి దుర్యోధనుని వలన నొకస్వల్పరాజ్యమునకు సధిపతి యయి విఱ్ఱవీగుచు ననేకాధ్మకార్యములనుఁ జేసి యధర్మయుద్ధముచే ననేకులఁ జంపిన యీదురాత్ముఁడు కుంతితో నట్లు పలికి యుండునా ? ఏమివింత ! తక్కిననలుగురుపాండవులను నొక్కొక్కసమయమునందు జంపక విడిచె నని కుంతీవరకథను బ్రతిష్టించుటకుఁ జెప్పఁబడి యున్నది. అనఁగా నీవరమే లేకపోయిన యెడల నా నలుగురినిఁ జంపియే యుండు ననియతిశయోక్తికొరకు నీగాథ కల్పింపబడినది.

3. కర్ణునిచేత వేయఁబడినసర్పముఖశరము శ్రీస్వామివారర్జునునిరథమును గ్రిందికి నణగునట్లు చేయుటచేత నర్జునుని శిరస్సును దునుమక కిరీటమును హరించె నని యున్నది. ఇది కల్పితకథ కాకపోవునని మనము నమ్మవచ్చును. దీని నాధారముగఁ జేసికొని కర్ణుడు తనరథచక్రము భూమిలో గ్రుంగగానే దిగి యాచక్రము నెత్తఁగా భూమియంతయు మీఁదికి లేచినదని యొకకథ కల్పింపబడినది. ఎవ్వఁ డీబ్రహ్మాండము లన్నిటికి నాధారుఁడో యట్టివాఁడు రథముపయి నుండి దానినిఁ భూమిలోఁ గ్రుంగునట్లు చేయఁగలఁడు. ఆమహానుభావునితో నీకర్ణుఁడు సముఁ డని తెలుపుటకు గర్ణుడు చక్ర మెత్తనకథను