పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము.

15

యుండలేదా! అప్పు డేల యారథము కాలిపోలేదు. అప్పు డంతయు శ్రీస్వామివారు దానినిఁ గాలనీయక రక్షించి రని యంటిమా, యట్టిశక్తి గలవాఁ డిప్పుడుమాత్రము దానిని గాలకుండ రక్షింపలేక పోవునా! ఏమివింత ? కావున నిదియుఁ గ్రంథకర్తయొక్క కల్పిత కథయే; యయి యున్నది.

కర్ణునినే నమ్ముకొని దుర్యోధనుఁ డిట్టియధర్మము జేసి ప్రజానాశనము జేయుటయే కాక వృద్ధబంధుమిత్రు లగువారిని హతులనుగాఁ జేసియున్నందున నట్టికర్ణునివిషయముఁ జెప్పుటకు జివరకు నిలిపి యుంచితిని గావున నతనివిషయము నింకఁ జెప్పఁబోవుచున్నాను.

1. ఈకర్ణుడు జనించుటలో నభేద్యకవచకుండలములతోఁ బుట్టెనఁట. ఇది యపూర్వసృష్టి. అవి యుండినయెడల నర్జునుఁ డితనినిఁ జయింపఁజాలఁ డని యింద్రుఁడు వీనినిఁ దన కిమ్మనుటయుఁ నీకర్ణుఁడు దానముకంటె వెరొకసుకృతము లే దని శరీరమునుగోసి యాకవచమును గుండలములను నిచ్చిన ట్లొకగాథ కలదు. చర్మమును దీసిన బ్రదుకుట యెట్లు ? ఈ యసంభావిత విషయమునుఁ దెలిసికొనలేక కవులు వెఱ్ఱులైయొక నిదానవిషయము పొగడవలసి వచ్చినప్పుడు దాన కర్ణుఁ డని వర్ణించెదరు

2. కుంతిదేవి కిచ్చినవరమున నర్జునుఁడు గా తక్కిన నలుగురుపాండవులను నీకర్ణుఁడు చంపక విడిచెనఁట. మరియు