పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము.

13

9. ప్రాణములు వదలిన ద్రోణునిశిరస్సును ధృష్టద్యుమ్నుఁడు నరికినటుల నున్నది. ప్రాణములు వదిలిన కళేబరము క్రిందఁ బడక కూర్చొని యుండునా ! కావున నిది యసంభావితము. అలసిన యీముసలివాఁడు ప్రాయోపవేశముచేఁ బ్రాణములను విడుచుటకొరకు గూర్చొని యుండును. ఇతని కాపని యెందు కని ధృష్టద్యుమ్నుఁ డోర్వలేక తలఁ దునిమి యుండును.

10. అశ్వత్థామచే వేయఁబడిన నారాయణాస్త్రమును శ్రీస్వామివారు వ్యర్థముచేసినట్టు లొకచోటఁ జెప్పఁబడియున్న ది. వాహనములను దిగిన వారి నది యేమియుఁ జేయదని యెరిఁగినవారు కావున నట్లు సెల విచ్చి యుందురు. అట్లు చేయుట తప్పుగ గానరాదు. ఈయస్త్రమును సేన మొత్తముమీఁదఁ బ్రయోగించెను. అటుల లేక యర్జునునిమీఁదనే వేసియుండిన యెడల భగదత్తునిచే వేయఁబడిన వైష్ణవాస్త్రమువలె నిదియు శ్రీస్వామివారియం దేదో యొక యలంకారముగఁ బరిణమించి యుండును. వృధాగా దానివలన మడియుటకంటె బ్రాణములను సులభసాధనమువలనఁ దప్పించుకొనుట వీరధర్మము నై యున్నది. ప్రత్యస్త్ర ప్రయోగమువలన నలసినపుడును, మూర్ఛఁ జెందినపుడును సారధి తననేర్పువలన రథికుని యుద్ధభూమి నుండి వేరొకచోటికిఁ దొలగించుట మొదలగు ననేకమైన, పనులు యుద్ధములోఁ జరుగుటఁ గలదు. ఇందు మనము తీసికొన