పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము.

7

యెవ్వరికిని వారినిఁ జంప వశమా యనునాధిక్యమును వ్యక్తపరచుట కీవిచిత్రసృష్టికథను గ్రంథకర్త కల్పించెను.

గాంధారి పట్టమహిషి గావున ధృతరాష్ట్రునికుమారు లందరు నామె కుమారులుగానే వాడఁబడిరి. ఆమెకు బహుశః దుర్యోధనదుశ్శాసనులు స్వకుమారు లై యుండవచ్చును. తదితరు లితరభార్యల లేదా భార్యలవలె నంతఃపురమునం దుంపఁబడినస్త్రీల కుమారు లై యుండవచ్చును. అట్టివారు గాక వివాహితభార్యల కుమారు లైనచో నాభార్యలపేరు లేల చెప్పఁబడవు. యుయుత్సుఁ డనువాఁడు ధృతరాష్ట్రునికి గోమటి దానియందుఁ బుట్టిన ట్లొక చోట స్పష్టముగఁ జెప్పఁబడియున్నది. ఇందునుబట్టిచూచినను నుంపుడు స్త్రీలు ధృతరాష్ట్రునకుఁ గలిగి యుండుట స్పష్టపడుచున్నది. లేదా గాంధారికుమారులే యని వీరినిఁ జెప్పుదుమంటిమా ; ఒకస్త్రీకి నూర్గురుకుమారులు పుట్టుట యసంభావితము. ఆకాలముననే గాక యిప్పటివరకు రాజు లుంపుడుస్త్రీల సంతఃపురమునం దుంచుటయు, నట్టిస్త్రీల కుమారులకు సముఖమునందు గూర్చుండుమర్యాద నిచ్చుటయు, కుమార్తె లైనయెడల వివాహములు చేయుటయు జరుగుచున్నది

2. అరణ్యవాససమయమున నింద్రునిపనువున నర్జునుఁడు స్వర్గమునకుఁ బోయి యింద్రునివలనఁ దివ్యాస్త్రలాభముఁ