పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

ఉపోద్ఘాతము.

భారతమునఁ జేర్పఁబడినటులను సాధించెను. ఆచర్చ నిచట వ్రాయఁబూనుట యనవసరము. నేను దానినిఁ జదివి యాయా యుక్తులను, సందర్భములను బండితులతోఁ జర్చించితిని. వారును నేనును నాగ్రంథముయొక్క యుపోద్ఘాతము వ్రాసినవానియభిప్రాయముతోనే యేకీభవించితిమి.

ఇఁక మహాభారతగ్రంథకర్త కౌరవపక్షపాతి యనువిషయమును వ్రాయుచున్నాను.

1. గాంధారికి నొకమాంసపిండము పుట్టిన దనియు, దానిని నూరుశకలములుగఁ గోసి వేరువేరు పాత్రములయం దుంచి వానికిఁ గొన్నిదోహదములు చేయఁగా నవి నూర్గురు కుమారు లైనటుల జెప్పఁబడి యున్నది. మాంసపిండమే గర్భములో నుండి వచ్చినపిదప శిశువు గానేరదు. అట్టి దానిని నూరుతునకలుగాఁ గోసి కుండలలో నుంచుటయు నవి నూర్వురుబిడ్డ లగుటయుఁ గడువింతగ నున్నది. ఇట్టియసంభావితమును విచారించిచూచినవా రెవ్వరును నొప్పఁజాలరు. అయితే నటుల నెందులకుఁ జెప్పఁబడిన దన, ఆపిండము గాంధారిగర్భములోనే పెరిగి యందరుబిడ్డల తోపాటుపుట్టక పోవుటయే కాక నూరుశకలములుగా విభజింపఁబడి నూర్గురు కుమారులయినందున బలక్షీణమయి, యాకుమారులు భీముని చేత హతు లయిరి గాని లేకపోయినయెడ భీమునకే కాక