పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

అని సెలవీయఁగా నాదేవి తనను శ్రీరాములవారు పరిగ్రహింపరేమోయని దుః:ఖించెను. అపుడు శ్రీస్వామివారికిఁ గోపముహెచ్చి 'నాకువచ్చిన యవమానమును బాపుకొనుటకు రావణవథాది కార్యములను దీర్చి ధన్యుఁడ నైతిని. అదియంతయు నీకొఱకుగాదు. కావున నాత్మభరణార్థము నీ కిష్టమైనచోటికిఁ బోవలసినదేకాని నాయొద్ద నుండఁదగవ ' ని సెలవిచ్చిరి. ఆమాటకు సీతాదేవి దుఃఖించి శ్రీస్వామివారితో 'సర్వేశ్వరులయ్యు మీ రిట్లు సాధారణ మనుష్యునివలె శంకించుట తగ 'దని మనవిచేసి తన నిర్మల్యమును జూపుటకై యగ్నిప్రవేశము చేసెదనని ప్రతిజ్ఞచేసి యందుకై చితిపేర్చు మని లక్ష్మణునిఁ గోరఁగా నతఁడొకింత సందియ మొంది యన్న మొగముఁజూచి యాతని యంగీకారమును ముఖభావమువలనఁ దెలిసికొని చితినిఁ జేర్చెను. అపుడాదేవి,

సీ. "అనిశంబు మచ్చిత్త మాత్మనాథునియందుఁ
           దవిలివర్తించుట దథ్యమేని
     వితతదుష్టత్వ శంకితనైన యే నుర్వి
           నతిశుద్ధచారిత్ర నైతినేని
     కరమువాజ్ఞ్మానసకర్మంబుచే మనో
           ధిపుమాట మీఱి వర్తింపనేని