పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

తునిచే దమవిజయమును సీతాదేవికిం దెలియజేయించిరి. విభీషణ పట్టాభిషేకానంతరము సీతాదేవివిషయమున ముందు జరగవలసినపనిని విచారించి విభీషణునితో నాదేవిని మంగళ స్నాతను గావించి నాకడకుం దీసికొనిరమ్మనిసెలవిచ్చిరి. అపుడావిభీషణుఁడు శ్రీరామాజ్ఞాప్రకారముగ నాదేవికి మంగళ స్నానము జేయించి యూయమ నొకపల్లకియందునిచి శ్రీరామునికడకుఁ దోడ్కొనివచ్చుచు ముందుగ శ్రీస్వామివారిసన్నిధికి వచ్చుచుండగా నాదేవిని దూరమునఁజూచి శ్రీస్వామివారు సంతోషము, రోషము, దీనత్వము గలవారై యామెను దమయొద్దకుం దోడ్కొ,నిరమ్మని విభీషణున కానతిచ్చి పంపిరి.

అట్లు వచ్చుచున్న శ్రీయమ్మవారినిఁ జూచుటకు వానరులు గుంపులుగూడగ విభీషణుఁడు వారినిఁ దూరముగఁ దొలఁగునట్లు చేయుచున్నందున నపుడు శ్రీస్వామివారు. విభీషణునితో వివాహ కాలమునందును, భర్తసమీపమునందును, దుఃఖసమయములయందును, నాపదలుసంభవించు నపుడును, యాగములయందును, స్వయంవరకాలమందును, యుద్ధమునందును, స్త్రీలు నలుగురికి గనఁబడుట దూష్యముగాదనియు, అందు నీదేవి యుద్ధగతయు, నాపద్గతయు, వ్యసనసంగతయు, భర్త నగునాసమీపమున నున్నదియు గావున నితరులు చూచుట కాక్షేపణము లేదని సెలవిచ్చిరి. అప్పటికాలమున నంతఃపుర