పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

153

రాకుండుటచే శ్రీరాములవారు కోపించి సుగ్రీవునికడకు లక్ష్మణునిఁ బంపిరి. అపుడతఁడు తెలివి తెచ్చుకొని క్షమార్పణము కోరి సేనలను దీసికొని శ్రీరాములవారిసన్నిధికివచ్చి నమ్రుఁ డయ్యెను,

అటుపయిని సుగ్రీవుని యాజ్ఞప్రకారము సీతాన్వేషణముకొఱకు వానరులు వెళ్లుటయు, హనుమంతుఁడు సముద్ర లంఘనముచేసి లంకాపట్టణములో నున్నసీతనుఁ జూచి యా వృత్తాంతమును శ్రీస్వామివారి కెఱింగించుటయు నాపిదప వారిధినిఁ గట్టి లంకాపురము ముట్టడించుటయు, సుగ్రీవహనుమంతుల చరిత్రములలోనును రావణాదివీరుల యుద్ధక్రమము వారివారి చరిత్రములలోనును వ్రాయఁబడి యుండుటచే నిచటఁ జెప్పఁబడలేదు.

రావణ వధానంతరము విభీషణుఁడు దుష్టుఁడగు నారావణునకు దాను దహనాదిసంస్కారములను జేయనని విముఖుఁడై యుండగా నపుడు మహావీరుఁడగు నీతనికి సంస్కారములు చేయుమనియు విరోధమనునది మరణాత్పరమునందుండగూడదనియు శ్రీరాములవా రానతిచ్చినందున నతఁడు యథావిధిగ సంస్కారములు జరిపెను.

ఆపిదప శ్రీరాములవారు లక్ష్మణస్వామివారినిఁ బంపి విభీషణునకు లంకారాజ్యాభిషేకముం జేయింపించిరి. హనుమం