పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

డనగు నేను నీకు సహాయుఁడనుగా వచ్చి యతనితో యుద్ధము చేసి చంపెదను' అని సెలవిచ్చి వెంటను వెళ్లియుందురు. అట్లు సుగ్రీవుఁడు వాలిని యుద్ధమునకు బిలువఁగా వారిరువురును బోరునపుడు సుగ్రీవుఁడు వాలిచే నొక్కు పడి చంపఁబడ బోవు తరుణమున జెట్టుచాటుననున్న శ్రీస్వామివారు స్నేహితుని గాపాడుటకుగా ద్వరపడి బాణమువేసి వాలినిఁ జంపి మిత్రుఁడగు సుగ్రీవునిఁ గాపాడి ప్రతిజ్ఞను నెరవేర్చుకొని యుందురు. ఇందుకొక దృష్టాంతము భారతయుద్ధమున మనకుఁ గలదు. భూరిశ్రవునిచే సాత్యకి తలఁ దునుమఁబడబోవుసమయమున నితరులతో యుద్ధము చేయుచున్న యర్జునుఁడు శ్రీకృష్ణులవారిపనుపున నదివరకు సాత్యకినిఁ జంపుటకయి యెత్త బడియున్న ఖడ్గసహితమగు భూరిశ్రవుని హస్తమును దునిమి సాత్యకిని గాపాడెను గదా! కావున బ్రాణోపద్రవకాలమున నేవిధముననైనను మిత్రునిఁ గాపాడుట పరమధర్మము.

వాలి వధానంతరము శ్రీస్వామివారు లక్ష్మణుని బురములోనికిఁ బంపి సుగ్రీవునకు బట్టాభిషేకముఁ జేయించి తాము సోదరయుక్తముగ గిష్కింధాసమీపమున నున్న ప్రస్రవణ పర్వతమునందు వర్షాకాలము వెళ్లిపోవువరకు నివసించియుండిరి. శరత్కాలము వచ్చినను సుగ్రీవుఁడు రాజ్యసుఖముల ననుభవించుచు గామోన్మత్తుఁడై యేర్పాటుప్రకారము సేనలతో