పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

151

యరచి పిలిచినట్లును, అప్పుడు వాలిసుగ్రీవులకు యుద్ధము జరిగినట్లును, అందు శ్రీస్వామివా రేకరూపముతోనున్న యా యిరువురిలో వాలియెవ్వఁడో యని సంశయించి వాలినిఁ గొట్టకయున్నట్లును, మరల శ్రీస్వామివారి ప్రోత్సాహముచే సుగ్రీవుఁడు వాలినిఁబిలిచి యుద్ధము చేయుచుండఁగ శ్రీస్వామివారు చెట్టుచాటుననుండి వాలిని సంహరించినట్లును శ్రీమద్రామాయణమున గానుపించుచున్నది. మహావీరుఁడును సర్వేశ్వరుఁడును నగు శ్రీస్వామివారు సుగ్రీవునితో యుద్ధము చేయుచున్న వాలినిఁ జాటుననుండి యేవిధముగ గొట్టియుందురో బాగుగ విచారింపవలసియున్నది. ఈగ్రంథకర్త వానరులను వీరిని గోతులని నమ్మియున్నందున గోతులు మృగములను బెద్దయాధారమును దీసికొని యట్లు మృగములను జాటున నుండి చంపుట రాజులకు దగునని ముఖ్యకారణముగ శ్రీస్వామివారు వాలితో సెలవిచ్చినట్లు గ్రంథములో గనఁబరచెను. వానరులు కోతులు గారని యిదివరకే చర్చించియుంటిమి కావున నీసందర్భములో నీగ్రంథములోని యెవ్వరివాక్యమును బ్రమాణముగఁ దీసికొనక సంగతిసందర్భముల నాలోచింప వలసియున్నది. అది యెట్లుండుననఁగా ? శ్రీరాములవారు సుగ్రీవునితో 'నాకును వాలికిని బూర్వవైరములేదు. ముందుగ నీవు వాలిని యుద్ధమునకు బిలువుము. నీ వలసినపుడు నీసఖుఁ