పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

ఋశ్యమూకపర్వతముమీదికేగి యచట వారి నుండుమనిచెప్పి భయముచే నింకొకచోట డాగియున్న సుగ్రీవునికడకరిగి యతనితో నారాజకుమారుల వృత్తాంతమును జెప్పఁగా నందఱును గలిసి రామలక్ష్మణులున్న చోటికి వచ్చిరి. అపుడు సుగ్రీవుఁడు శ్రీరాములవారితో 'తాము నాతో సఖ్యముచేయఁ గోరి యున్నారని హనుమంతునివలన వింటిని. మీరు భూపతులు నే నడవిలో సంచరించువాఁడను. మీతో సఖ్యము జరిగిన యెడల నాకేవిశేషలాభము సమకూడు' నని పలికి శ్రీస్వామివారితో హస్తమును బట్టి సఖ్యముచేసికొనెను. అపుడు శ్రీస్వామివారు సుగ్రీవుని కోరికప్రకారము వాలినిఁ జంపుటకు బ్రతిజ్ఞచేసిరి. సీతాదేవి యెచ్చటనున్నను వెదకిదెచ్చి సమర్పించెదనని సుగ్రీవుఁడు ప్రతిజ్ఞచేసెను. అటుతర్వాత నంతరిక్షమార్గమున రావణునిచే దీసికొనిపోవఁబడుచున్నట్టి యమ్మవారి వలస గ్రిందవేయఁబడి తనచే దాచియుంపఁబడిన యాభరణములను దెచ్చి సుగ్రీవుఁడు శ్రీస్వామివారికి గనఁబరచెను. ఆపయిని శ్రీరాములవారు వాలిని సంహరింపగలరో చాలరో యని సుగ్రీవునకు సంశయము గలిగి సప్తసాలవృక్షముల నేకబాణముతో గొట్టుమని గోరఁగా నట్లుచేసి యతని సంశయమును బాపిరి. పిమ్మట వారందరును గిష్కింధాసమీపమును జేరి శ్రీస్వామివారి పనుపున సుగ్రీవుఁడు వాలిని యుద్ధమునకై