పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

149

వధకొఱకు బంపఁబడినవారినిగా భ్రమసి కొంతదూరము పరుగెత్తి యంతట నావచ్చినవా రిరువురు నెవ్వరో తెలిసికొనిరమ్మని తన మంత్రులలో బుద్ధినధికుఁడగు హనుమంతునిఁ బంపెను. అతఁడు శ్రీరామలక్ష్మణులయొద్దకేగి వారి రూపములనుజూచి గొప్పవారని తలఁచి వందనము చేసి 'మహనీయులుగా గనఁబడుచున్న మీరిరువురు నెవ్వరని యడుగుచు దాను సుగ్రీవుని మంత్రియనియు, దనపేరు హనుమంతుఁడనియు, మీ సఖ్యమునుగోరి మాయధిపతి మీసన్నిధికి నన్నుఁ బంపెననియు మనవిచేసెను. అపుడు శ్రీస్వామివారు లక్ష్మణునివైపు తిరిగి మన మెవ్వనిసఖ్యము గోరివచ్చుచున్నామో యతనిమంత్రియే యితఁడనియు సంస్కృతభాషను బ్రశస్తముగ మాటలాడు చున్నాఁడనియు నితనితో మనవృత్తాంతమును జెప్పుమని సెలవిచ్చిరి. ఈసందర్భమును శ్రీమద్రామాయణమున జదువు వారికి గ్రంథకర్త తన నమ్మికనుబట్టి కామరూపమగు మానవ శరీరముతో వచ్చియుండెనని చెప్పియున్నను హనుమంతుఁడు కోతియని మనము నమ్ముచున్న వానరుఁడు గాడని తోపక మానదు.

ఆపిదప హనుమంతుఁడు. లక్ష్మణునివలన వారి వృత్తాంతమును సమగ్రముగా దెలిసికొని సంతసించి, వారును సుగ్రీవుని సఖ్యమును గోరుచుండుటవలన వారినిఁ దోడ్కొని