పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

వరకు బోవుట తగనిపని. అందునుండియేకదా శ్రీరాములవారామెను విడిచివచ్చినందుకు లక్ష్మణుని నిందించిరి. మఱియు తల్లి, తోబుట్టువు, భార్య, కుమార్తెలయొద్దకుగాక తదితరస్త్రీ లెంత పూజనీయులయి యుండినను వారియొద్ద నొంటరిగా నెవ్వరు నుండఁగూడదు.

అట్లు లక్ష్మణుఁడు పోయి యన్నను గలియఁగా వా రతని నిందించి యాశ్రమమును జేరి సీతన్ గానక విచారపడుచు దక్షిణదిక్కునుబట్టి వెదకుచు నేగిరి. పోగాబోగా గొంతదూరమున రావణునిచేతఁ గొట్టఁబడి పడియున్న జటాయు వను వానిం గాంచి యతనివలన రావణుఁడు సీతాదేవినిఁ గొనిపోయె ననివినిరి. ఈజటాయువుండు స్థల మిప్పటి జటప్రోలు అనుచోటయి యున్నది. వెంటనే యతఁడు ప్రాణములను విడిచెను. అతనికి సంస్కారములు చేసి గొంతదూరము పోయి కబంధుఁడనువానిచే బట్టువడి వాని బాహువులను ఖండించి సుగ్రీవునితో సఖ్యముచేయుమని వానిచే బోధింపఁబడి యతఁడు చెప్పినమార్గమున బోవుచు శబరిచేత సత్కృతులై సుగ్రీవ నివాసమగు ఋశ్యమూక పర్వతము సమీపమున బంపాసరోవరతీరమునుఁ జేరిరి. అపు డాపర్వతముమీద మంత్రి సహితుఁడై యున్న సుగ్రీవుఁడు శ్రీరామలక్ష్మణుల నిరువురను దూరమునుండి చూచి వారినిఁ దనయన్నయగు వాలిచే దన