పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

147

సమాయచే వేయఁబడిన యరపుగాని రాముని మాటగాదని బహువిధముల నెంతచెప్పినను వినక దూరనాడినందున విధిలేక పర్ణశాలవిడిచి లక్ష్మణుఁడు రామునికొరకు బోయెను. అపుడు రావణుఁడు భిక్షువేషమునవచ్చి యొంటరిగ నున్న సీతాదేవి నెత్తుకొనిపోయెను. ఈపర్ణశాల యుండుచోటు భద్రాచలము. ఇచట మనము తీసికొనవలసిన నీతులెవ్వి యనిన:--

శ్రీరాములవారు సర్వేశ్వరులును సర్వజ్ఞులును గాన, ముందు జరుగబోవునది యంతయు వారెఱుఁగుదురు. కాని మనవంటివారు స్త్రీల నటుల నడవికిం దీసికొనిపోగూడదు. మఱియు బ్రతివ్రతాశిరోమణి యైనను బోరానిచోటులకు దనను దీసికొనిపొమ్మని భర్త మొదలగువారిని నిర్బంధింపఁగూడదు. లక్ష్మణస్వామి భ్రాతృవాత్సల్యమును భక్తిని బట్టి యన్న వెంట శుశ్రూషకయి యరణ్యమున కేగుట మంచిపనియే. కాని తాను సీతాదేవియొక్క రక్షణమునకై శ్రీస్వామివారిచే నుంపఁ బడియు నాయమ యాడిన యసంబద్ధవు మాటల కాదేవిని విడిచి రాముఁ డున్నదిక్కున కేగుట తగదు. ఆమె యాజ్ఞను గూడ మీరక పోయెనంటిమా యాస్వామికి భయముండదని నమ్మినయట్టివాఁడు సమీపమున నొక పొదలో డాగి యామె రక్షణమును గనిపెట్టుచుండక శ్రీస్వామివారు కనఁబడునంత