పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

మోహపరవశునిగ జేసెను. అపు డా రావణుఁడు మాయావంతుఁడును గామరూప శక్తిగలవాఁడును నగు మారీచుని కడకేగి నే బూనుకొన్న పనికి సహాయుఁడవు గమ్మనియు నీవు చిత్రమృగరూపమును దాల్చి రాముఁడుండు పర్ణశాలకు సమీపమునఁ దిరుగుచున్నయెడల నిన్నుఁబట్టుటకు రామలక్ష్మణులు ప్రయత్నింపుదురు. అప్పుడు నేను సీతనుఁ గైకొనివచ్చెదననియు జెప్పి యొప్పించెను. అ ట్లీమారీచుఁడు చిత్రమృగ రూపమునుదాల్చి పర్ణశాలసమీపమున దిరుగుచుండగా సీతాదేవి యామృగమును జూచి దాని నెటులైనఁ బట్టుకోని తెచ్చిన యెడల దాను దానినిఁ బెంచెదనని కోరఁగా లక్ష్మణుఁడు వలదని చెప్పినను శ్రీస్వామివారు మృగమైనఁ బట్టితెచ్చెద ననియు రాక్షసుఁడైన సంహరించి వచ్చెదననియు బ్రత్యుత్తర మిచ్చి భార్యాసంరక్షణముకొరకు లక్ష్మణు నాశ్రమమున నునిచి యా మృగముకొఱ కేగిరి. అమృగము చేతికి దొరకునట్లు తిరుగుచు శ్రీస్వామివారినిఁ గడుదూరము దీసికొనిపోయెను. అంతట లక్షణుఁడు చెప్పినట్లు రాక్షసుఁడే యని నిశ్చయించి బాణముతో గొట్టిరి. తోడనె యా మారీచుఁడు హా లక్ష్మణా ! హా సీతా! యని యరచుచు జచ్చెను. ఆమాటలను సీతాదేవి విని శ్రీస్వామివారి కపాయము వచ్చియుండునని భ్రమసి వారికి సాయముకొరకు లక్ష్మణుని బొమ్మని చెప్పఁగా నతఁ డిది రాక్ష