పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

శ్రీస్వామివారినిఁ బ్రార్థించి యటుల ననుజ్ఞఁ గైకొని పరివారసహితుఁడై కదలి యయోధ్య కేగక దాని సమీపమున నుండు నందిగ్రామమున నాపాదుకలను సింహాసనమున నునిచి రాజ్యమేలుచుండెను.

అప్రయత్న సిద్ధమైన రాజ్యమును స్వీకరింపక భరతుఁడు తన యన్నయందుగల భక్తివలన నాయననే యా పదునాలుగు వత్సరములుగూడ నేలుమని ప్రార్థించుటయు, నందుకు శ్రీరాములవా రొప్పనిపిదప వారి పాదుకలను వారికి బ్రతినిధిగఁ గైకొని సింహాసనమున నునిచి యభిషేకించి తాను మంత్రివలె రాజ్యము నేలుచుండుటయు మిగుల శ్లాఘ్యము. అది మొదలుగ బాదుకల నారాధించు మతాచార మేర్పడినది.

భరతుఁ డరిగినపిమ్మట శ్రీస్వామివారు చిత్రకూటమును విడిచి యత్రిమహాముని యాశ్రమమును జేరి యచటినుండి దండకారణ్యము ప్రవేశించి ముందుగ విరాధుఁడను రాక్షసుని జంపి శరభంగ మహాముని యాశ్రమమును బ్రవేశించిరి. అచట వాలఖిల్యాది మహర్షులు తమకు రాక్షసులవలన గలుగుచున్న బాధలను వారింపుమని కోరగా నట్లు చేయుదుమని సెలవిచ్చి సుతీక్ష్ణ మహాముని యాశ్రమమును జేరిరి. అచటినుండి యనేక మునుల యాశ్రమములను జూచుచు నట్లు పదిసంవత్సరముల వరకు గాలమును గడిపి తిరుగ సుతీక్ష్ణమహాముని యాశ్రమ