పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

143

శరీరముతోనున్న యాస్వామివారు కొంత దుఃఖింపవలసి యుండును. కావునఁ దండ్రివిషయమునకు భరతుఁ డుత్తరము చెప్పకముందే రాజధర్మములను బ్రశ్నరూపముగఁ బోధించిరని మనము నిశ్చయింపవచ్చును.

ఇట్టిసర్వజ్ఞునకు రావణవధాత్పూర్వము జయముకొరకు నగస్త్యుఁడు సూర్యు నారాధింపు మనె నఁట. మాతలి బ్రహ్మాస్త్రము నేయు మని యాది చేసినఁట ఏమివింత ?

పయివిధమున శ్రీరాములవారు రాజధర్మముల నడిగిన పిదప భరతుఁడు తండ్రిమరణమును దెలిపెను. అపుడు శ్రీస్వామివారు చేయఁదగినయుత్తరక్రియలను జరిగించిరి. పిమ్మట భరతుఁ డనేకవిధముల బలుమారు రాజ్యమును స్వీకరించి యేలు మని శ్రీస్వామివారినిఁ బ్రార్థించెను. అందుకు శ్రీస్వామివారు తండ్రిచే నియోగింపఁబడిన యరణ్యవాసము పూర్తియగువరకు నయోధ్యాపురమునకు ఖండితముగ రా ననియుఁ నంతవరకు నీవే రాజ్యము నేలు మనియు, తండ్రియగు దశరథుని నసత్యవంతునిగాఁ జేయఁగూడ దనియు, ధర్మయుక్తముగాను యుక్తియుక్తముగాను సెలవిచ్చి భరతునిఁ దుదకు నొప్పించిరి. అపు డాభరతుఁడు తాను వెంటఁ దెచ్చిన శ్రీరామపాదుకలను సింహాసనమునందు వారికి బ్రతినిధిగ నుంచుకొని తానొకమంత్రివలె బ్రజలను బాలించుట కనుజ్ఞ నిప్పింపుమని