పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

139

శ్రేయోనిష్ఠయైన మద్బుద్ధి ననుసరింపుము" అని సెల విచ్చిరి. తల్లియొద్ద సెలవుఁ గైకొని శ్రీరాములవారు తమనగరున కేగి యరణ్యవాసవిషయమును సీతాదేవితో సెలవీయఁగా నా యమ తానుఁగూడ వెంట వచ్చెద నని యతినిర్భంధము చేసినందున నందుకు దుద కోయకొనిరి. స్త్రీని వెంటఁదీసికొని వెళ్లినందుచేతనేకదా సీతావియోగాదికము శ్రీస్వామివారికి సంభవించెను. సర్వజ్ఞుఁడును సర్వేశ్వరుఁడును నగు నాయనకు దుఃఖములేకపోయినను దదితరు లట్లు భార్యను వనమునకుఁ దీసికొనిపోయినయెడల నాపదలు రాక మానవు. సమీపమున నపు డున్న లక్ష్మణుఁడు తానుగూడ వెంట వచ్చెద నని బహువిధములఁ బ్రార్థింపగా నందు కంగీకరించి సీతాలక్ష్మణ సహితులై శ్రీరాములవారు తండ్రియొద్దకుఁ బోయి సెలవు గైకొని పురజనులందఱు దుఃఖ సముద్రమున మునిఁగియుండ, నారచీరలు ధరించి యరణ్యవాసముసకుఁ బయలుదేరి వెడలిరి. సుమంత్రుఁడు గంగానదియొడ్డువరకు రథసారధిగా నరిగి గుహుఁడు వారినోడతో గంగ దాటించినపిదప మూడుదినములవరకు నానదీతీరమునఁ గాచియుండి, యయోధ్యకు రథమునుఁ దోలుకొనివచ్చి దశరథున కావృత్తాంతమును దెలిపెను.

రామవియోగవిషాదమువలన నాటిరాత్రియే యమహారాజు పరలోకగతుఁ డాయెను. సన్నిధిని గుమారు లెవ్వరును