పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

పెను. అపుడు శ్రీస్వామివా రరణ్యమున కేగెద నని తండ్రి యెదుట నొప్పుకొని తల్లియగు కౌసల్యయొద్దకు సెలవుబొందుట కరుగఁగా నచట లక్ష్మణస్వామివా రి ట్లనిరి:-

గీ. "విషయపరతంత్రుఁడై ధర్మవిధికిఁ దప్పి
    మది ననారత మిది కార్య మిదియకార్య
    మని యెఱుంగక వర్తించునతఁడు తండ్రి
    యైనఁ గడువధ్యుఁడని పల్కి రార్యు లధిప.

క. జనపతి నీదగురాజ్యముఁ
   గొనుటకు నేబలము? పిదప గుణహీనతఁ దా
   మును కొని యేకారణమున
   దనమదిఁ గైకేయి కొసఁగఁ దలచె మహాత్మా!

ఇట్లనేకవిధములఁ జెప్పఁగా నపుడు శ్రీరాములవారు సెలవిచ్చినదానిలో ముఖ్యాంశ మేమి యనిన :--

గీ. "ధరణిఁ బురుషార్ధములలోన ధర్మ మెక్కు
    డట్టిధర్మంబునందు సత్యంబు నిలిచి
    యుండు నన్నిఁటికంటె నత్యుత్తమంబు
    గురునియానతి నడచుట గురుగుణాఢ్య.

కావున నేను బితృశాసనంబునఁ గైకేయిచేతఁ బ్రచోదితండ నైతి నింకఁ దానిఁ గడవంజాల నీవ శుభం బైనక్షత్ర ధర్మంబునందు బుద్ధిఁ జొరనీక తీక్ష్ణస్వభావంబు విడిచి పరమ