పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

137

వచ్చును. శ్రీకృష్ణులవారు కాని కార్యమున కెందుకు వచ్చితిరని విదురునిచే నడుగఁబడి హితకార్యమునకుఁ బ్రతివాఁడును బ్రయత్నింపఁ బూనవలసినదనియు, నట్లు చేయనియెడల బాతిత్యము సంభవించుననియు, గార్యకారి కాకపోయినను నట్టి ప్రయత్నమునకు ముందు ఫలము గల దనియు, సెలవిచ్చి యున్నారు. జగదీశ్వరుఁడే మేలుకొరకుఁ బ్రయత్నించినపుడు వశిష్ఠుఁడుమాత్ర మేల ప్రయత్నించియుండఁగూడదు? కావునఁ బట్టాభిషేకవిఘ్నవిషయ మాఋషికి ముందుగఁ దెలియదని తేటపడఁగలదు.

మఱియు నిప్పటికాలపువారివలె గాక తారలనుమాత్రము చూచువాఁడుక గలదినముల నాటివాఁడగు వశిష్ఠుఁడు శ్రీస్వామివారికిఁ బట్టాభిషేకమునకు సంపత్తారను నిర్ణయించెను. . వారికి రాజ్యలాభసంపద పోవుటయే కాక వనవాస కష్టము, భార్యావియోగము, రావణాదివీరులవధవలని శ్రమయు, సంప్రాప్తమాయెను.

ఆమరునాఁటియుదయమున శ్రీరాములవారినిఁ బిలిపించి దశరథుఁడు దుఃఖమువలన గైకేయి కిచ్చినవరములవిషయమును జెప్పలేక యున్నపు డాదేవి శ్రీరాములవారితో 'నీవు పదునాలుగు సంవత్సరము లరణ్యవాసము చేయునటులను భరతుఁడు రాజ్య మేలునటులను నాకు నీతండ్రి వర మిచ్చె ' నని తెలి