పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

గ్రంథమున వాడుక చేయఁబడె నని శంక గలుగును. పౌరుష నామములన్నియు నాయాపనులు జరిగినపిదప వాడఁబడును. అట్టివారిచరిత్రలు వారియనంతరమునందు వ్రాయఁబడును. స్పచ్ఛందమరణునికి మరణానంతరమునగాని, యాపేరు రాదు కదా! అట్లనే యీరావణున కానామములు ప్రయోగింపఁబడెను.

11.శ్రీరాములవారు.

శ్రీమన్నారాయణుఁడు రావణాదిదుష్టులను సంహరించి తద్వారా శిష్టరక్షణము చేయుకొరకు దశరథమహారాజునకుఁ జ్యేష్ఠ భార్యయగు కౌసల్యయందుఁ జ్యేష్ఠకుమారుఁడై యవతరించెను. ఆయనకు పశిష్ఠమహర్షి శ్రీరామనామము నుంచెను. సుమిత్రయను రెండవభార్యయందు. లక్ష్మణశత్రుఘ్నులు కవలుగ జన్మించిరి. మూడవభార్యయగు కైకేయియందు భరతుఁడను కుమారుఁ డుదయించెను. వీరిలోఁ బాల్యము మొదలు రామలక్ష్మణులు మైత్రి గలిగి యుండిరి. అట్లనే భరతశత్రుఘ్నులు నుండిరి.

ఇట్లు వీరు దినదినప్రవర్థమానులై యుండఁగా నొకనాఁడు విశ్వామిత్రమహర్షి దశరథమహారాజుకడ కేతెంచి తానుఁ జేయు నొకగొప్పయాగమునకు రావణునిభటులగు మారీచసుబాహులను వారు పలుమారు విఘ్నములు చేయు