పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

131

ఈ గ్రంథకర్త రావణునికి బదితలలు గలిగియున్నవని నమ్మియున్నందున నాపదితలలును బదిపర్యాయములు కొట్టినట్లు అనఁగా నొకనూరుతలలు కొట్టఁబడినట్లు వ్రాసియుండెను' కాని హస్తములవిషయ మేమియు నెత్తుకొనలేదు. పదితలలు గలవానికి నిరువదిచేతు లుండవా? యని తలఁచి రావణుఁడు వింశతిభుజుఁ డని గ్రంథములో నచ్చటచ్చట వ్రాసెను. ఒక్కటే శిరస్సు కల దని నమ్మియుండినయెడల దానినిఁ బది పర్యాయములే కొట్టె నని నిజముగ జరిగినది జరిగినట్టే వ్రాసి యుండవలసివచ్చును. కాని యితనికి దశకంఠుఁ డని పౌరుషనామ మేల కలిగినదో చూతము. రావణునివధనాఁడు శ్రీస్వామివారిచే వేయఁబడినబాణములవలనఁ దొమ్మిదిపర్యాయములు తలలు దెగఁగొట్టఁబడుచు దిరుగ మొలచుచుండుటనుఁ జూచి దివ్యాస్త్రమువలనఁగాని యితఁడు చావఁడని శ్రీస్వామివారు తలఁచి బ్రహ్మాస్త్రమును బ్రయోగించి సంహరించిరి. ఇట్లు తలలు మొలచుట యేదో యొకవరప్రభావమైయుండును. వరప్రభావముగూడ మతసంబంధములగు నమ్మకములలో నొకటియై యున్నది. ఇట్లనే కార్తవీర్యార్జునుని బాహువులను శ్రీపరశురాములవారును, బాణాసురుని బాహువులను శ్రీకృష్ణస్వామివారును, దెగఁగొట్టియుందురు. మరియు నీరావణునికిఁ దశకంఠుఁ డను పేరు వానిసంహారమువకు ముందే యెట్లు