పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

129

వచ్చి లక్ష్మణస్వామిని మూర్ఛితునిఁ జేసెను. అపుడు శ్రీరాములవారు కోపించి తీవ్రశరములను రావణునిమీఁద వేయఁగా నతఁడు వానికి సహింపలేక యుద్ధభూమినుండి మరలిపోయెను.

పదునొకండవనాఁడు. రావణుఁడు శత్రువిజయముకొరకు బాతాళహోమమను నొకదానినిఁ జేసినట్లును, నాహెూమమునకు విఘ్నముచేయుటకయి వానరు లేగి రనియు నామీఁద రావణుఁడు మూడవసారి యుద్ధమునకు వచ్చె ననియుఁ జెప్పఁబడి యున్నది. నాఁడు రామరావణయుద్ధము కడుభయంకరముగఁ జరిగెను. తుదను శ్రీస్వామివారిచే వేయఁబడినబ్రహ్మాస్త్రముచే రావణుఁడు హత్తుఁ డాయెను.

ఈరావణునకు దశకంఠుఁ డనియు వింశతిభుజుఁ డనియు వాడుక కలదు. అట్టి యాకారముతోనే యిప్పటికిని నీశ్వరునికి వాహనముగ వేంచేయింపు జరుగుచున్నది. ఒక్కశరీరమునకు బదితలలును నిరువదిచేతులును నెట్లుండును. అట్లుండిన శరీరికి సౌఖ్యమును సదుపాయము నెట్లుకలుగును. కావున నీయసంభావిత మెట్లు కలిగినదో విచారింపవలసి యున్నది. హనుమంతుఁడు లంకలో వెదకునపుడు స్త్రీలమధ్యమున రావణుఁడు రెండుబాహువులును, నొక్కతలయును గలవాఁడయి నిద్రించుచున్నట్లు చెప్పఁబడి యున్నది,