పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

రాక్షససేనాధిపతియగు ప్రహస్తుఁడు యుద్ధమునకు వచ్చెను. అతఁడును వానరసేనాధిపతియగు నీలునిచేఁ జంపఁబడెను. అందుకు రావణుఁడు కడు దుఃఖితుఁ డయి మూలబలమును దీసికొని తానే యుద్ధమునకు వచ్చి శ్రీరాములవారితో యుద్ధము చేసెను. అపుడు శ్రీరామునిబాణములదెబ్బకు జడిసి యూరకయుండఁగా నట్టివానినిఁ జంపుట తగ దని శ్రీరాముల వారు తలఁచి యతనిని శ్రమ దీర్చికొని మరుచటినాఁడు రమ్మని చెప్పి పుచ్చిరి. ఏడవనాఁటియుద్ధమున రావణుఁడు తనతమ్ముఁడగు కుంభకర్ణుని యుద్ధమునకుఁ బంపెను. అతఁ డనేక వీరులతో యుద్ధముచేసి తుదను శ్రీస్వామివారిచే సంహరింపఁ బడెను. ఎనిమిదవనాఁటియుద్ధమున లక్ష్మణస్వామి యతికాయునిఁ జంపెను. ఈయతికాయుఁడు రావణునికుమారుఁడు. నీతిమంతుఁడు. రావణునిమంత్రులలో నొకఁడు.

తొమ్మిదవనాఁ డింద్రజిత్తు మూడవసారి యుద్ధమునకు వచ్చెను. ఇతఁడు రావణుని పట్టమహిషియగు మండోదరికి జన్మించినవాడు కావున యువరాజు అప్పు డనేకులగువీరులతో నేర్పుతోను వేగముతోను యుద్ధముచేసి తుదను లక్ష్మణస్వామిచేఁ జంపఁబడెను.

రావణుఁ డింద్రజిత్తుచావునకు దుఃఖించి పదియవనాఁ డతికోపముతో రెండవసారి యుద్ధమునకు వచ్చెను. ఇట్లు