పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీకృష్ణ.

ఉపోద్ఘాతము.

మన యార్యమతగ్రంథములు మూడువిధములు. ప్రభు సమ్మితములు, సుహృత్సమ్మితములు, స్త్రీసమ్మితములు. అందు ప్రభుసమ్మితములు వేదములు, అనఁగా శ్రుతిస్మృతులు, సుహృత్సమ్మితములు పురాణములు. స్త్రీసమ్మితములు కావ్యములు. శ్రుతిస్మృతులు ప్రభువాజ్ఞవంటివి కావున వానిని విడిచి పామరులకొరకు బుట్టినపురాణాదులవిషయము ముందుగ గొంత చర్చ జేసి యాపిదప నాయీగ్రంధమును వ్రాయఁ బూనుచున్నాను. పురాణములు పదునెనిమిది, ఉపపురాణములు పదునెనిమి దనియు, ఇరువదియారుకంటె నెక్కుడు గల వనియు గ్రంథాంతరములవలనఁ దెలియుచున్నది. వానిలో మొదటి పురాణసంహిత లారనియే శ్రీభాగవతగ్రంథములోఁ జెప్పఁబడి యున్నది. ఎటులైనను ద్రిమతాచార్యులచేత నంగీకరింపఁబడిన పురాణములే గాని యితర మైనవి ప్రమాణములు కావు. మత పక్షపాత బుద్ధితోఁ జెప్పఁబడినవి కావున మనము వానిని విననే కూడదు. పురాణములకు మొదటి సృష్టి యనఁగా గోళములు