పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

123

నరులు, వానరులు మొదలగువిభాగము జరిగినది. . మరికొంత కాలముపిదప నేయేదేశములఁ బ్రజలు నివసించుచువచ్చిరో యాదేశములపేరులతో బిలువఁబడుచుండిరి. అనగా రాజపుత్రులు, బంగాళీలు, మలయాళీలు మొదలగువారు. రెండవవిభాగమందుఁ జెప్పఁబడిన వివిధనామములకు నర్థములన్నిటిని నిచ్చట విచారించుట యేల? ఇటీవల రెండవవిభాగమునఁ జెప్పఁబడిన విభాగములలోఁ గనుపడనివారిని స్వర్గాదిలోకముల లోనివారై యుండినట్టు మనగ్రంథకర్తలు తీసికొనిరి. తదితరులలోఁ గొందరిని నరులుగను, వానరులుగను, రాక్షసులుగను, దయ్యములని మనము సాధారణముగ నమ్ముచున్న భూత పిశాచములుగను దీసికొనిరి. వానరు లనఁగా నడవియందు నివసించుజను లని వాచస్పతినిఘంటువువలనను బ్రౌనుదొరవారి డిక్ష్ణరీవలనను దేఁటపడుచున్నది. కోఁతులును వనమం దుండెడివి. కావున వానికిని వానరశబ్దముఁ గలదు. గనుక గ్రంథకర్త వారినిఁ గోతు లని భ్రమసియుండును. కావున నతఁడు వానరులను గోఁతు లని నమ్మియుండుటనుబట్టి కోఁతిరూపమును జేష్టలను బ్రతిచోటను వర్ణించుచుఁ బోయెను. కపిశ వర్ణముగలవా రగుటచేత వీరినిఁ గపు లనియెదరు. కపిశవర్ణ మనఁగా నలుపు నెరుపు కలిసినరంగుకు పేరు. దీనినిఁబట్టి యోచింపఁగా నీవానరవీరులు ప్రథమవిభాగమగు తామస