పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

పర్వతముసమీపమునఁ జేరి వానరులు పరితపించుచు బ్రాయోప వేశమునకు సమకట్టియుండఁగా సంపాతి యనువానివలన సీతాదేవిని రావణుడు లంకకుఁ గొనిపోయెనని తెలిసికొని వారు సముద్రలంఘనముకొరకుఁ బ్రయత్నించిరి. అప్పుడు వారిలో హనుమంతుఁడు సముద్రలంఘనము చేయఁగలనని చెప్పి యట్లు చేసి లంకకుఁ బోయి ప్రచ్ఛన్నముగ నర్ధరాత్రమందు సీతాదేవికిఁ గనబడి యామె నోదార్చి శ్రీరాములవారిచే నానవాలుగ నీయఁబడిన ముద్రికను సమర్పించి యామెకు గల సందేహములను మాన్పి ప్రతియానవాలుగ శీరోమణినిఁ దీసి కొనెను.

ఆపయి నింతదూరము వచ్చిన తనను శ్రీరాములవారు రావణునిసంగతిసందర్భముల నడుగుదురని యెంచుకొని రావణునిఁ జూచుతలంపు గలిగి యతనియుద్యానమగు నశోకవనముఁ జెరుపుచుండెను. అపు డతనిమీఁదికి యుద్ధమునకుఁ బంపఁబడిన రాక్షసులను గొందరినిఁ జంపి తుదను రావణుని కుమారుఁడగు నింద్రజిత్తుచేత నతఁడు పుట్టుపడియెను. ఆ యింద్రజిత్తు హనుమంతుని రావణునియెదుటికిఁ దీసికొనిపోయెను. అప్పు డారాక్షసరాజుతో దననిజస్థితినిఁ దెలుపుచు బుద్ధులు చెప్పఁగా నతఁడు కోపించి ముందు చంపఁ బ్రయత్నించి విభీషణునిచే వారింపఁబడి తుదకు దోకకు జమురులో