పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

(అంతకాలము జీవించియున్నట్లు మన మొప్పికొనినను) గర్భోత్పత్తికాలము మించినపిదపఁ బాయస మహిమవలన నైనను గర్భము లెట్లు గలిగినవియో మిగుల నసంభవముగ నున్నది. కావున నరువది వేలసంవత్సరములకాలము నొప్పుటకు వీలు లేదు. మనగ్రంథములలో ననేకస్థలములయందు గాలపరిమితినిఁ జెప్పవలసిన సమయములలో సహస్ర మనుశబ్దము వాడుకజేయఁబడి యున్నది. ఆసహస్రశబ్దమునకు శతస్థానమునకు మీదిది యగు సహస్రసంఖ్య యని మన మెప్పుడును దీసికొనఁగూడదు. ఆసహస్రశబ్దమున కనేక మని యర్ధముఁ గలదు. కావున వర్షసహస్రము లనఁగా ననేకవర్షము లనియు ననఁగా సంఖ్యచే నరువది యనియు గ్రహింపవలెను. ఈవిషయము దశరథుఁడు విశ్వామిత్రునితోఁ జెప్పినట్లుమాత్రము కనిపించుచున్నది. మరి యెచ్చటను గానరాదు.

పండితసాధారణముగా నెల్లరు నరువదివేలసంవత్సరములని యభిప్రాయపడుచున్నందున నీవిషయ మింతచర్చతో వ్రాయుట యైనది. కావున నాదశరథుఁ డరువదిసంవత్సరములే ప్రభుత్వము జేసియుండును లేదా జీవించియుండును. అప్పటికాలపువారు మనకంటె దృఢమైనశరీరబలము గలవారగుటచే నాదశరథుఁ డరువదిసంవత్సరములవరకు నిదానించి పుత్రలాభముకొరకుఁ బ్రయత్నపడియుండును