పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీకృష్ణ.

శ్రీమద్రామాయణ విమర్శము.

1. దశరథమహారాజు.

ఈయన సూర్యవంశజుఁడు. అజమహారాజునకుఁ బుత్రుఁడు. రఘుమహారాజునకుఁ బౌత్రుఁడు. ఈయన యరువదివేలసంవత్సరములు రాజ్యపాలనము చేసినపిదప నప్పటికిని బుత్రలాభము లేనందున బుత్రకామేష్టి యను నొకక్రతువును జేసి తనయులను బడసినట్లు చెప్పఁబడి యున్నది. ఈయన యరువదివేలసంవత్సరము లేకారణముచేతనైనను జీవించి యున్నట్లు మన మొప్పినను నతనిభార్యలు, బంధువులు, మిత్రులు మొదలయినవా రతనితోఁబాటుగ నెట్లు జీవించి యుండియుందురో వింతగ నున్నది. మరియు నిక్కాలపు వారికంటె నక్కాలపువారి కాయుర్దాయము హెచ్చుగ నుండినను సంతానకాలము మించినపిదపఁ బుత్రలాభముకొరకుఁ బ్రయత్నింపక యరువది వేలసంవత్సరములవరకు నిదానించి సంతానార్ధము ప్రయత్నించుట మరియు వింతగ నున్నది. పాయస మహిమవలన భార్యలు బిడ్డలను గనియుండకూడదా యని యంటిమా ! వివాహ కాలములోగా బరిణయమైనభార్యలకు