పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

107

యుక్తముగ నున్నదానిఁ జూచి యచ్చెరువొందె నని యున్నది. అంతకుముందు ఛందోయుక్తముగ నేదియు లేకపోయినయెడల ఛందోయుక్తముగ నుండినటుల నతని కెట్లు దెలిసెను. కవిత్వమునుఁ జెప్పునేరని మనకు ఛందోలక్షణములు దెలియునా? అయితె మరి యెందు కటులఁ జెప్పఁబడిన దనఁగా నాగ్రంథ మన్ని గ్రంధములకంటె ముందుగఁ బుట్టిన దని జనులను నమ్మించుట కటులఁ జెప్పఁబడియుండును. ఉపనిషత్తులు కొన్ని ఛందోయుక్తముగ నున్నవి. అవియుఁగూడ నీగ్రంథమునకుఁ దరువాతఁ బుట్టిన వని నమ్మవలసివచ్చును. మరియు మనగ్రంథముల వరుసనుబట్టి చూడఁగా ముందు వేదములు అనఁగా శ్రుతిస్మృతులు, నాపిదపఁ బురాణములు, తరువాత గావ్యములు పుట్టియుండుటనుబట్టియేకదా ప్రభు సుహృ త్కాంతా సమ్మితము లని నిర్ణయింపఁబడి యున్నవి. ఇంతియకాక యిది శ్రీరాములవారి కాలానంతరమునందును జాలకాలమునకు బుట్టియుండును. ఏల యనిన వనములయందు సంచరింపుచుండు జనులగు వానరులను గోతులుగను నేకశిరస్శుగలరావణుని దశ శిరస్సులుగలవానిగనుఁ దీసికొనిఁ యానమ్మకమునకుఁ దగినటుల నాయా చేష్టలను వర్ణనలను ననేకస్థలములఁ జేసెను. వానరు లనువారు నరులే గాని మర్కటములు గా రని సుగ్రీవుని కథాంతమందును రావణుని కొకశిరస్సే గల దని యాతని