పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీకృష్ణ.

రెండవభాగము.

శ్రీమద్రామాయణము

ఉపోద్ఘాతము.

దీనిని వాల్మీకియనుఋషి చెప్పినటుల నున్నది. అయితే నాఋషి దీనినంతను జెప్పియుండునా. లేక సూక్ష్మముగఁ జెప్పియుండునా విచారింపవలెను. శ్రీరాములవారిసన్నిధిని గుశలవులవలన నాఋషి పాడించినటుల నున్నది. ఈయిరువదినాలుగువేల గ్రంథమును బ్రభువులకుఁ బాడించి వినుటకు వీలుండదు. కావున సూక్ష్మరూపముగనె పాడించి యుండవలెను. మరియు నీక్రిందఁ గనబరుపఁబోవు ననేకాసందర్భములతో నిండియుండిన దానిని శ్రీస్వామివారు విని యెటుల నంగీకరించి యుందురు? అందువలన నిది యిటీవలఁ జెప్పఁబడియుండవలెను. శ్రీమద్రామాయణమునకు ముందు ఛందోయుక్తముగ నేదియు లేదనియు ముందుగాఁ దనకు స్ఫురించిన, "మానిషాదప్రతిష్ఠాంత్వ మగమశ్శాశ్వతీస్సమాః | యత్క్రౌంచమిథునాదేకమవధీఃకామమోహితం" అను నీశ్లోకమునుబట్టి వాల్మీకి ఛందో