పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

97

విష్ణుపురాణములోఁగూడ నాప్రశంస యేమియు లే దనియుఁ జెప్పెను.

మరియు రాథవిషయమున మిగులనవమానకరమగు నొకగొప్పతప్పుటభిప్రాయము గలదు చూడుఁడు. రాథ యను నామము భారత, భాగవత, హరిపంశ , విష్ణుపురాణములయం డెచ్చటను గానరాకపోయినను బ్రహ్మవైవర్తపురాణమునందు రాథ యనునాపెతో శ్రీకృష్ణులవారి కొకసంబంధము గలదని గొప్పతప్పుకథ వ్రాయఁబడెను. ఈక్రొత్తపురాణ మసందర్భములగు మనుష్యులయొక్క యూహలకు మించినవ్యవస్థలతో నిండియున్నది. ఆయమ శ్రీకృష్ణులవారికి మేనమామభార్య యనియును శ్రీకృష్ణులవారియందు విశేషమోహపరవశయై యుండెననియును జెప్పఁబడియున్నది. అమెవిషయమై 'ధీరేంద్రనాద్ పాల్ ' గారు కవులయొక్క కల్పనావ్య క్తి దప్ప మరి, యొకటి కా దని చెప్పుచున్నారు. అయితే ఆమెవిషయము కవులయొక్క పెద్దతప్పయియే యుండవలెను. గాని యామె కేపల కవికల్పిత కా దని నాయభిప్రాయము. ఏలనంటే ఆమెవిగ్రహము శ్రీకృష్ణవిగ్రహమునకు బ్రక్క నుంపఁబడి యిండియాదేశమునందంతట నారాధింపఁబడుచున్నయది. కవి కల్పిత యైనచో నటుల నారాధింపఁబడునా ! నే నామెను శ్రీకృష్ణులవారియొక్క ముఖ్యభార్యయగు రుక్మిణీయే యని .