పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

15–16 శతాబ్దముల మధ్యకాలమై యుండు నని సమర్థించిరి. అతఁడు రచించిన శ్రీకృష్ణులవారు, వారిజీవితకాలము, వారి బోధనలు' ననుపుస్తకమును బ్రారంభముమొద లంతమువరకుఁ జదువుటకు మిమ్మును ముఖ్యముగ వేడుచున్నాఁడను.

శ్రీకృష్ణులవారికాలము ద్వాపరముయొక్క యంతమందు గాని కలియుగముయొక్క యాదియందుగాని అనఁగా 5006 సంవత్సరములక్రిందట యని మసయార్యు లు సాధారణముగ నమ్మియున్నారు. ఎటులనైన ననేకసహస్రసంవత్సరములై యుండును గదా! మరియు మనపురాణములన్నియు నేకకాలమందు గాని, యొకపురుషునివలనగాని వ్రాయఁబడినవి కావు. ఈ పురాణములలో మన మనుకొనుచుండు సృష్టికాలముమొద లతిసాహసముతో ముందు రాబోవు ననఁగా నీయుగాంతము వరకును సంగతులు వ్రాయఁబడి యున్నవి. అందుల విషయములనుబట్టి మన కవకాశ మగు నన్నివిధముల యోచించి చూచెదము. మహాభారతము భారతయుద్ధము జరిగిన పిదప ననేకశత సంవత్సరములు గతించిన పైని వ్రాయఁబడినట్లున్నది. ఇది యర్జునునికి బ్రపౌత్రుఁడగు జనమేజయ మహారాజునకును భాగవత మర్జునునికి బౌత్రుఁడగు పరీక్షిన్మహారాజునకును నప్పటిఋషులవలనఁ గథారూపముగఁ జెప్పఁబడినట్లు ప్రారంభింపఁబడి యున్నది. ఆకథలు శ్లోకరూపముగ మరి