పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీకృష్ణులవారిని గురించి మనముపడియెడి దురభిప్రాయములు

శ్రీకృష్ణులవారిని గురించి మనము సాధారణముగ నభిప్రాయపడి యుండునట్టియు నసత్యములై నట్టియు వారివారికి దోచినటుల వాడుకొనబడుచున్న విషయములను గనబరుప బోవుచున్నాఁడను. ముఖ్యముగా నార్యుల మగు మనమే కాక ప్రతిమతములవారును నందు విశేషించి నిష్పక్షపాతబుద్ధి గలవా రేది ధర్మవిరుద్ధముగను యుక్తిబాధితముగసు నుండునో దానిని సుతరాము విడిచి పెట్టవలయును. ఇది ప్రతిమనుష్యుఁడు ముఖ్యముగ మనస్సునందు నుంచికొనవలసిననీతి యయి యున్నది.

శ్రీకృష్ణులవారికాల మిది యని యేశాస్త్రజ్ఞులవలన నిదివరకు నిస్సందేహముగ నిశ్చయింపఁబడియుండ లేదు. కొందరు యూరోపుదేశపువిద్వాంసులు క్రీస్తుశకమునకు ముందు 14-వ శతాబ్ద మా శ్రీకృష్ణులవారి కాలమని యేకాభిప్రాయు లైరి. మరికొందరు క్రీస్తుశకమునకు ముందు 13 లేక 12-వ శతాబ్దములని చెప్పిరి. ఇప్పటికాలపు కలకత్తాలోనుండిన 'ధీరేంద్రనాద్ పాల్ ' గారు శ్రీకృష్ణులవారి కాలము క్రీస్తుశకమువకు ముందు