పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xi

మొట్టమొదట సంస్కృతభాషను ఛందోబద్ధముగ జేసె ననుటకు గారణ మగపడదు. ఇట్టి యభిప్రాయమును స్థాపించుచు మహారాజా వా రిచ్చిన హేతువులు బాగుగ నున్నవి.

మహారాజావా రభిప్రాయపడినట్లు శ్రీరామ నిర్యాణమునకు జాలకాలము పిదప రామాయణకవి యీ కావ్యమును వ్రాసి యుండవలెను. ఈయన శ్రీరామ సహాయులైన సుగ్రీవాదుల నందరిని గోతులుగ వర్ణించియున్నాడు. వీరు నిజముగ గోతులయి యుందురా? కోతులయినయెడల హనుమదాదులు చేసినట్లు రామాయణకవిచెప్పిన పనులను వానరులు చేసియుందురా ? అట్టిపనులను వానరులు చేసి యుందురని చెప్పుట యసంభావ్యము. గనుక సుగ్రీవాదులు ప్రస్తుత మరణ్యప్రదేశములందున్న మనుష్యజాతులవారై యుండవచ్చును. కనుక సుగ్రీవాదులందరు మనుష్యులేయనిచెప్పిన మహారాజా వారి యభిప్రాయము నందరు నంగీకరింపక తప్పదు.

సామాన్యముగ హిందువులకు జాతకముహూర్త విషయములలో నమ్మకమున్నది. ఇట్టి నమ్మకము పరప్రచారకులగు ననేకులకు జీవనోపాధిఁ గల్పించుటయే గాక కొన్ని సమయములందు దాదృశ విశ్వాసానుసారముగ నడచువారికి హానిని