పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

చున్నారు. ఇట్లు విమర్శనము లేని మనపండితులవలన మనయార్యమత మన్యమతస్థుల కాక్షేపణీయ మగుచున్నది. ఈబోపదేవుఁడను వానికాలమునాటికి శ్రీకృష్ణులవారే పరాత్పరులని నమ్మినవారు హెచ్చుమంది యుండి యుందురు. అది బౌద్ధమతమునందు యుక్తప్రవర్తనవలననే ముక్తి కలదు గాని జపతపోహోమార్చనాదులవలన ముక్తి లేదనుసిద్ధాంత మగుటచే నెవ్వని నప్పటి ప్రజలు పరాత్పరునిగ నమ్మియున్నారో యట్టి వానిప్రవర్తనము మంచిది కాదని చెప్పి బోధపడచుటచేత శ్రీకృష్ణులవారియందు బరాత్పరుఁడనునమ్మకము కొందరికి బోయి బౌద్ధమతములో సులభముగ జేయుండి యుందురు. ఇక్కాలవువివేకముగల కొందరుపండితులు రాసక్రీడాదిగాధల గ్రంథశైలినిబట్టి యోచింపఁగా దదితర భాగములశైలి ననుసరించి యుండలేదని చెప్పుచున్నారు.

ఇటులనే కేవలమతగ్రంథములయందు శంకరరామానుజ మధ్వాచార్యులశిష్యపరంపరవారు వారివారి మతముల పుష్టికయి కొన్ని కొన్ని గాధలను గల్పించియున్నారు.



__________