పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

రాటంకపరచి యాత్మవథకు మారుగా నాత్మస్తుతినిఁ జేసికొమ్మని బోధపరచిరి. అంతట నట్లు తూలనాడఁబడి ధర్మరా జరణ్యమునకుఁ బోవ సమకట్టగా శ్రీకృష్ణులవారు కొన్నిహితవాక్యములనుఁ జెప్పి మరలించిరి. అప్పుడు ధర్మరా జిట్లు పలికెను :--

క. "ఇది యట్టిద మోసంబున
   బదిలుఁడగా కేను మున్ను పదిరినకతనన్
   హృదయము గలఁగిన నా కె
   య్యదియును దోసమి నికారి నైతి మహాత్మా.

అ. ఇట్టి నన్ను ననునయించి బోధించితి
    కరుణ సేర్మిజేసి గారవమున
    నజ్ఞులైన మమ్ము నాపత్సయోనిధి
    మునుఁగుకుండఁ గాచి తనఘమూర్తి."

ఆపయిని గృష్ణార్జును లుభయులును ధర్మరాజునొద్ద సెలవును బొంది కర్ణునిఁ జంపుటకు యుద్ధభూమికి మరలఁ జేరిరి.

ఈపయికథలో గ్రహింపవలసిన విషయములు మూడు కలవు :-

1. ఎవఁడుగాని మనస్సునందు శపథము చేయఁగూడదు. అది రహస్యమైనది యైనందున గురుపితృభ్రాతృమిత్రాదులకు సహా బాధ కలుగును. అట్లనే యీయర్జునునిప్రతిజ్ఞవలన