పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

కాఁడు. కావున నీప్రకారముగా నాత్మను దెలిసికొని నీవు దుఃఖించుటకు దగవు.

దీర్ఘములగు బాహువులుగల యోయర్జునుఁడా ! నీ వొకప్పుడీయాత్మను నెల్లపుడు బుట్టుచున్న వానిగాను నెప్పుడును జచ్చుచున్న వానిగాను దలంతువేమో అట్లయినను నీయాత్మను గూర్చి దుఃఖించుటకు దగవు.

పుట్టినవానికి జావును జచ్చినవానికి మరల బుట్టుటయును నిశ్చితమై యుండఁగాఁ దప్పింప శక్యముగాని యీజనన మరణములవిషయమున నీవు విచారింపఁ దగదు.

ఓయర్జునా ! మనుష్యాది శరీరములు ప్రకృతినుండి కలుగుచు బుట్టినవెనుక గొంతకాలమువరకు నహంకార మమకారముల కాధారములై కనుపించుచు. మరణానంతరమున దిరుగ నాప్రకృతిలో జేరుచున్న వి. అట్టియీశరీరములవివయమున దుఃఖ మేమి?

ఒక్కఁ డీయాత్మ నద్భుతపస్తువువలె జూచుచున్నాఁడు. మరియొకఁ డద్భుతవస్తువునువలె జెప్పుచున్నాఁడు. ఇతరుఁ డద్భుతవస్తువును వినునట్టు లీయాత్మను వినుచున్నాఁడు. అట్లు వినియు జూచియు జెప్పియును సాధారణముగ నెవ్వఁడును నీయాత్మయొక్క యాధార్థ్యము నెరుంగ లేఁడు.