పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

అశాశ్వతమైనవస్తు వెప్పటికిని లేనిదే యగును. శాశ్వతమైనవస్తువున కెన్నఁడును నాశ ముండదు. తెలివిగలవా రీ రెండువస్తువులయాధార్థ్యము నిట్లు తెలిసికొనుచున్నారు.

ఏయాత్మవస్తు వీసర్వ ప్రాణులయందును వ్యాపించినదో యట్టియాత్మవస్తువును నాశము లేనిదానినిగా దెలిసికొనుము. వృద్ధిక్షయములు లేని యీయాత్మస్వరూపము నెవ్వఁడును నశింపజేయఁజాలఁడు.

ఓయర్జునా ! పెరుగుట తరుగుట మొదలగు వికారములు లేనట్టియు దేహాద్యుపాధులు నశించినను దాను నశింపనట్టియు నింద్రియగోచరుఁడు కానట్టియు నీజీవాత్మ నిత్యుఁడు. ఉపాధులయిన యీశరీరములు నాశము పొందుచుండును. కావున యుద్ధము చేయుము.

ఆత్మ చంపు ననియు జంపఁబడు ననియు నను కొనువారు తెలివిలేనివారు. ఈయాత్మ యెవనిని జంపువాఁడు కాఁడు. ఎవ్వనిచేతను జంపఁబడువాఁడును గాఁడు.

ఈయాత్మయెప్పుడును బుట్టువాఁడుగాఁడు. ఎప్పుడునుజచ్చువాఁడు గాఁడు. మొదటినుండియు లేకుండి క్రొత్తఁగా గలుగువాఁడును గాఁడు. కొంతకాల ముండి మరల లేకుండువాఁడును గాఁడు. మరి యేమి యనిన జన్మ లేనివాఁడును, నాశము లేనివాఁడును, వృద్ధిక్షయములు లేక యెప్పుడు నొక్కరీతిగ నుండు