పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

90

కలుగునో యతడు హిందూమతమునుగాని మఱేమతమును గాని సులభముగాచేజిక్కు యేమతమునైనను నిరసింపజాలడు; తనకై ఒక క్రొత్తమతమును నిర్మించుకొనజూడడు. సత్యమగు పిపాస (దాహము) కలవానికి అటువంటి విచారణలు పెట్టుకొనుటకు వ్యవధి లేదు.

264. "ఓభగవతీ! నరులు నన్ను గౌరవించవలయునని నేను కోరను; నాకు యింద్రియభోగములు అక్కఱలేదు. గంగా యమునలు ఎడతెగక కలిసిపోయి ప్రవహించు తీరున నాఆత్మను నీలోనికి ప్రవహింపనిమ్ము. తల్లీ! నాకడభక్తిలేదు, ఏయోగమును ఎఱుగను. నేను దీనుడను; సావాసగాండ్రులేని వాడను. నాకు ఎవరిమెప్పులును అగత్యము లేదు. నామనస్సును మాత్రము నిరంతరము నీపాదపద్మములందు నిలువ నిమ్ము."

265. ఒకడు యిట్లుపలికెను. "పదునాలుగుసంవత్సరములనుండి నేనుదేవునికొఱకై దేవులాడుచున్నాను. ప్రతివానిసలహాను యనుసరించిపోవుచున్నాను; అన్నిపుణ్యక్షేత్రములకును యాత్రలుచేసినాను. అనేకులుసాధువులను, మహాత్ములను దర్శించినాను. ఏబదిఅయిదేండ్లు వచ్చినవి. నాకేమియు చిక్కు లేదు."

ఈపలుకులువిని శ్రీరామకృష్ణపరమహంసులు "నేను గట్టిగా చెప్పుచున్నాను; వినుము. భగవంతునికొఱకై పరితపించువాడు వానిని కనుగొనితీరును. నన్నుచూచిధైర్యము పూనుము" అనిచెప్పిరి.