పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

89

11వ అధ్యాయము.

త్రోసివేసి ఆమెకొఱకై పరివేదనము చేయుము. వెంటనే ఆతల్లివచ్చి నిన్ను చంకనెత్తుకొనగలదు.

259. "ఈజన్మలోనె నేను భగవంతుని పొందవలయును. ఇంతేల? మూడుదినములలో నేను ఆయనను ప్రత్యక్షము చేసికొనవలయును. ఇంతేకాదు! ఒకసారి వానినామస్మరణ చేసి తప్పక వానిని నాకడకు ఆకర్షించుకొందును." అనునట్టి తీవ్రభక్తిచేత భగవంతుడులాగబడి త్వరలోప్రత్యక్షము కాగలడు. కాని మందభక్తిగలవారికి భగవంతుడుకనబడునేని ఎన్నియుగములకోగాని అట్టిది సంఘటిల్లదు.

260. నీటమునిగినవాడు "ఊపిరాడక పరితపించునంతగా, భగవత్సాక్షాత్కారమగుటకు పూర్వము వానికొఱకై, నీహృదయము తీవ్రపరితాపమును పొందవలయును.

261. సాధకుని బలమెందున్నది? ఆతడు దేవునిబిడ్డడు. కన్నీరే వానిబలము. వెంటబడిఏడ్చుబిడ్డని కోర్కెలు తల్లులు తీర్చువిధమున, తనకొఱకైఏడ్చు బిడ్డలకోర్కెలు ఎట్టివైనను భగవంతుడు తీర్చును.

262. భగవంతునికొఱకై పరివేదనముచేయునతడు, ఏమి తిందును. ఏమి త్రాగుదును అను స్వల్ప విషయములను గురించి ఎంతమాత్రమును యోచనయే చేయజాలడు.

263. దప్పిగొనినవాడు; బురదగానుండెనని, నదీజలమును విడిచివేయజాలదు; నిర్మలోదకముకొఱకని నూతిని త్రవ్వుటకును, పూనుకొనడు. అటులనే ఎవనికి సత్యమగుధర్మపిపాస