పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10వ అధ్యాయము.

సాధకులలో వేర్వేఱు తరగతులు.

245. పేలాలు వేయించునప్పుడు వేపుడుమూకుడునుండి యెగిరివిచ్చుకొని బయటపడుగింజలు శ్రేష్ఠమైనవి. వాటికి ఏలాటిమచ్చయుండదు. బాగుగవేగి మూకుడులో నిలుచు పేలాలలో ప్రతిదానికిని కాలినమచ్చ కొంచెమైనను ఉండును. ఆలాగుననే సిద్ధభక్తులలో సంసారమును పూర్తిగవదలి వెలుపలబడినవారు శ్రేష్ఠులు, నిష్కంళంకులుగనుందురు. సంసారములలోనె నిలిచియుండు భక్తులలో పూర్ణసిద్ధులుసయితము వర్తనలో ఏదోలోపముగలిగి మచ్చబడియేయుందురు.

246. పారమార్ధికసాధకులలో రెండుతెఱగులవారు కాన్పించుచున్నారు; ఒకరకమువారు మర్కటకిశోరమును బోలువారు (క్రోతిపిల్లలవంటివారు). రెండవరకమువారు మార్జాల కిశోరమువంటివారు (పిల్లిపిల్లలబోలువారు). క్రోతిపిల్లచిత్రముగా తానె తల్లినిగట్టిగపట్టుకొనును; పిల్లికూన తనను తల్లిఎక్కడ నుంచిన అక్కడనేయుండి నిస్సాహాయమై దీనత్వముతో కూయుచుండును. క్రోతిపిల్ల తల్లిపట్టును తానువిడిచెనా క్రింద పడిహానిచెందును. అది తనబలమునే నమ్ముకొనియుండవలసినది. పిల్లిపిల్లను దానితల్లియే ఒకచోటునుండి మఱొకచోటునకు తీసికొనిపోవును. గాన దానికేఅపాయమునురాదు. అటులనే జ్ఞానయోగమునో, నిష్కామకర్మమునో నమ్ముకొను