పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

81

9వ అధ్యాయము.

కాని ఆగందఱగోళము వారుభోజనము ప్రారంభించువరకే. వడ్డన అయి, ఆపోశన పట్టునప్పటికే ముప్పాతికశబ్దము అణగిపోవును. ఇంకక్షీరాన్నమువచ్చును - వడ్డనసాగినకొలదినిధ్వని తగ్గిపోవుచుండును. మజ్జిగ దగ్గఱకువచ్చుసరికి త్రేణువులుతప్ప ఏమియు వినరాదు. భోజనములు ముగియగానే యికవారు చేయునది నిద్రపోవుటే!

నీవు భగవంతుని దాపునకుచేరినకొలదిని ప్రశ్నించుట, తర్కించుట, హితవు తప్పును. వానిని సమీపించి, ప్రత్యక్షముగ చూచునప్పుడు ఏగోలయు ఉండదు. వివాదములన్నియు తుదముట్టును. అది నిద్రకుసమయము; అనగా సమాధి యందు ప్రాప్తించు ఆనందమును యనుభవించుటకు సమయమువచ్చినట్లు. ఆదశయందు భగవంతుని దివ్యదర్శనానందమున మునిగిపోవుదుము.

238. పుస్తకములు - అనగా ధర్మశాస్త్రములు - అన్నియు భగవంతునిచేరు మార్గమును చూపును. ఒక్కసారి దాఱితెలిసికొనినపిమ్మట ఆపుస్తకములతో పనియేముండును? ఆపిమ్మట ఏకాంతముగా భగవధ్యానముచేయుచు ఆధ్యాత్మ నాధనముచేయు తరుణము ఏర్పడును.

239. తనబందువునకు యేవోకొన్ని వస్తువులు పంపుమని ఒకనికి తన యింటికడనుండి ఉత్తరము వచ్చినది. ఆతడు వస్తువులు తెప్పించబోవుచుండగా, ఉత్తరములో ఏయేవస్తువులు కావలెనని వ్రాయబడెనో తెలిసికొన గోరెను. ఉత్తరముకొఱకు చూడగా అది కనుబడలేదు. దానికై చాల