పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక.

ఇయ్యది "సేయింగ్సు ఆఫ్ శ్రీరామకృష్ణ " యను ఆంగ్ల గ్రంథమున కాంధ్రీకరణము. ఇందు శ్రీరామకృష్ణపరమహంసలవారి దివ్యోపదేశరత్నములన్నియు బొందుపరుపబడినవి. చక్కని నీతికథలతోడను, ఉపమానములతోడను, ప్రజా సామాన్యమునకు గూడ అర్ధమగునటుల నుద్దేశించి, అత్యంత సులభశైలిని వ్రాయబడిన గ్రంథరాజము.

ఈగ్రంథమును ప్రచురింపగలందులకు మాకత్యంత సహోపకారులుగానున్న తత్వానంద స్వాములవారికిన్ని , యం. వి. వారికిన్ని మాకృతజ్ఞతాపూర్వకమైన అభివందనములు,


ప్రకాశకులు.