పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

63

7వ అధ్యాయము.

195. ప్రకృతిశాస్త్రము ఖండజ్ఞానమును మాత్రమే ఒసగగలదని ప్రజలు గ్రహించలేకున్నారు. ఆఖండరాజ్యమునుండి దానిద్వారమున సందేశము లభింపజాలదు. అటువంటిసందేశమును పురాణఋషిసత్తములవంటి బ్రహ్మద్రష్టలు మాత్రమే తేగల్గిననారు. "భగవల్లక్షణములు యిటువంటివి" అని పలుకుటకు వారికి మాత్రమే అధికారము కలదు.