పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

61

7వ అధ్యాయము.

మగునెడల దెబ్బలాడియైనను నీగురువుయొక్క గౌరవమును సంరక్షించుము.

191. మానవరూపగురుడు చెవిలో మంత్రమును ఉచ్ఛరించును. శివరూపగురుడు నీహృదయమున ఆత్మప్రభోదమును కావించును.

ద్వి|| మంత్రంబు చెవినూదు మానవగురుడు
      ఆత్మలో ముద్రించు నలశివగురుడు.

192. సముద్రమున అడుగుననుండు ముత్తెపుచేప స్వాతినక్షత్రము మింటనుండగాపడు వానచినుకును నోటపట్టుకొనుటకై పైకివచ్చునని కధచెప్పుదురు. అని చెప్పనుతెఱచుకొని స్వాతిబిందువుకొఱకై నీటిమీద తేలుచుండునట. ఒకచుక్క నోటపడగానే నీటమునిగి అడుగునకుపోయి ఆవానచినుకును ముత్యముగా మార్చువఱకును అటనుండి కదలదందురు.

అదేతీరుస కొందఱు ముముక్షువులు[1] తమకొఱకై ముక్తిద్వారముల తెఱచిపెట్టగల మంత్రవాక్కును ఉపదేశించగల సద్గురువు కొఱకై ఎల్లెడల సంచారములు చేయుచుందురు. అట్టి సద్గురువు లభించి మోక్షద్వారములతెఱచు మహామంత్రమును ఉపదేశించునంతటి అదృష్టము పట్టినతోడ్తోడనే, సంగమును వీడి హృదయ గుహయందుచేరి" నిత్యానందప్రాప్తి కలుగువఱకును అందే నిలిచియుందురు.

  1. మోక్షమునుగూర్చి వాంఛించువారు.