పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

57

7వ అధ్యాయము.

నిట్లుచెప్పుదురు:- "నాగురుడు కల్లుకూటములకు పోవుగాక. అయినను అతడు నాకు నిత్యానందప్రభువే."

"నాగురువు త్రాగుబోతులయొక్కయు, పాపులయొక్క మూకల చేరుచుండుగాక, అయిననుగూడ ఆతడు నాకు వినిర్మల నిష్కళంక గురుమూర్తియే సుడీ?"

179. "గురువులు వందలుగను వేలుగను దొఱకగలరు; కాని శిష్యుడు ఒక్కడుదొఱకుట దుర్లభము" అను సామెత కలదు. అనగా మంచినీతులు చెప్పువారు చాలమందికలరు; కాని వానిని ఆచరించువారు అరుదు అని దీనిభావము.

180. గురువు అను సంధానకర్త ప్రేయసీప్రియులను కూర్చు దూతవలె, గురువు నరుని భగవంతునితో చేర్చును.

181. ఒకడు తనగురువుయొక్క వర్తననుగురించి వివాదపడుచుండుటచూచి శ్రీపరమహంసులవారు యిట్లు మందలించిరి:- ఇట్టి వ్యర్ధపువాదనలతో నీవేల కాలము వృధాచేయుచున్నావు? ముత్యమును తీసుకొని ముత్యపుచిప్పను పాఱవేయుము. నీకు గురువు ఉపదేశించిన మంత్రమును పునశ్చరణముచేయుము. ఆగురునిదోషములయొక్క విచారణను వదలివేయుము. పొమ్ము!

182. మనకు ఏదేని బోధించినవారినెల్ల గురువు లనుకొనకుండ, ప్రత్యేకము ఒకరిని గురువు అనిచెప్పుకొనుటకు అవసరమేమి? నీవు పరదేశమునకు పోవునప్పుడు దాఱితెలిసిన ఒకమార్గదర్శిని నమ్ముకొనవలయును. అటులగాక అనేకుల సలహాలను అనుసరించితివా గందఱగోళమున చిక్కిపోవు