పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7వ అధ్యాయము.

గురువు.

176. ఎవరికియెవరుగురువు? భగవంతుడొక్కడుమాత్రమే దాఱిచూపగలవాడు. అతడే జగద్గురువు.

177. తనగురువును మనుష్యమాత్రునిగ ఎంచునతడు ధ్యాననిష్ఠవలన ఏమిఫలమును పొందగలడు? మన గురువులను మనుష్యమాత్రులనుగ ఎన్నతగదు. శిష్యునకు భగవత్సాక్షాత్కారమగుటకు పూర్వము, బ్రహ్మజ్ఞానోదయకాలమున గురువుమొదట దర్శనమిచ్చును. పిమ్మట విచిత్రముగా తానే భగవత్స్వరూపము దాల్చి, శిష్యునకు భగవత్సాక్షాత్కారమును ప్రసాదించును. అప్పుడు గురువును, దైవమును, అభేదమని శిష్యుడుగ్రహించును. శిష్యుడుకోరు వరములనెల్ల ఈశ్వరరూపమునుదాల్చిన గురువే వానికొసగును. ఇంతేల, గురువే పరమానందపదవియగు నిర్వాణమునకు సయితము వానినిచేర్చును. లేదా భగవంతుడు ధ్యేయమూర్తిగాను తాను ధ్యాతగను భావస్ఫురణను నిలుపుకొనగోరు నరుడు అట్టిద్వైతభావముతోడను ఉండవచ్చును. అతడు దేనినికోరుకొనినను గురువుదానిని వానికి ప్రసాదింపగలడు.

178. శిష్యుడు గురువును యెన్నడును ఆక్షేపణచేయతగడు. గురువు ఎట్టినియమముచేసినను శిష్యుడు సంసిద్ధముగ విధేయుడై నిర్వహించవలయును. వంగభాషలో ప్రతీతముగ