పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

55

6వ అధ్యాయము.

టియే. నాయెడల మీరు విధేయులై వర్తించురీతిని వీనియెడల వర్తింపుడు. అటులచేయనివానికి శిక్షజరుగును" అనవచ్చును. ఇట్టి నూతనగౌరవమునుగూర్చి తడబడుచు, ఆసేవకుడు నమ్రుడై వెనుకాడినను కూడ, యజమానుడే బలవంతముగ వానిని ఉత్తమాసనమున కూర్చుండబెట్టును. చిరకాలము భగవత్సేవచేసి, వానితోడి ఐక్యసంధానమును పడసిన ఆత్మలదశ యిట్లుండును. భగవంతుడు తనమహిమను, విభూతులను వారియందుంచి, విశ్వాధిపత్యమును సూచించు తనసింహాసనమున వారిని కూర్చుండబెట్టును.

175. భగవద్భక్తుడు భగవంతుని తల్లీ! అని పిలుచుచు ఆనందపరవశుడగుటకు కారణమేమి? చంటిబిడ్డ ఇతరుల దగ్గఱకంటె యెక్కువచనువుతో తల్లికడ మెలగును. అందువలన ఆబిడ్డకు అందఱిలో తల్లిమీద మక్కువహెచ్చు.